‘బాహుబలి’ పార్ట్ 1 షూటింగ్ పూర్తిచేసుకుని జులైలో విడుదలకు సిద్ధం అవుతున్నా ప్రభాస్ మాత్రం తన లుక్ ను మార్చకుండా అలాగే పెరిగిన గెడ్డంతో బయట ఫంక్షన్స్ లో కనిపిస్తూ ఉండటంతో ప్రభాస్ తన ‘బాహుబలి’ పార్ట్ 1 విడుదల అయ్యే వరకు ఇదే గెటప్ లో కొనసాగుతాడా? లేదంటే ‘బాహుబలి’ విడుదల తరువాత మొదలయ్యే ఆ సినిమా పార్ట్ 2 షూటింగ్ పూర్తి అయ్యే వరకు అదే గెటప్ తో ఉంటాడా? అనే అనుమానాలు ప్రభాస్ ను చూసిన వారికి కలుగుతున్నాయి.

ప్రభాస్ ఫైనల్ టచస్ ఇస్తున్నాడు


ఇది ఇలా ఉండగా ఈమధ్య కాలంలో కొందరు ప్రముఖ నిర్మాతలు ప్రబాస్ ను కలిసి తమ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వినమని అడిగినా ప్రభాస్ ఎదో కారణాలు తెలుపుతూ సున్నితంగా వారి అభ్యర్ధనలను తిరస్కరించినట్లు టాక్. అయితే ఇప్పటికే ప్రభాస్ తన స్నేహితులు నిర్వహిస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమాను చేయడానికి అంగీకరించన నేపధ్యంలో ఈ సినిమా దర్శకుడు సుజిత్ తయారు చేసిన స్క్రిప్ట్ కు ప్రభాస్ ఫైనల్ టచస్ ఇస్తున్నాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. 

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా ఈసినిమా గురించి బయటకు వచ్చిన ఒక న్యూస్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు హీరొయిన్ గా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియాభట్ బాగుంటుందని దర్శకుడు సుజిత్ భావించి అలియాభట్ ను సంప్రదిస్తే సినిమాలోని తన పాత్ర నచ్చితే ప్రభాస్ పక్కన నటించడానికి తనకు అభ్యంతరం లేదు అని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. 


‘బాహుబలి’ విడుదల తరువాతనే తీసుకుంటాడు


అక్కినేని అఖిల్ మొదటి సినిమాకు హీరోయిన్ గా అలియాభట్ ను సంప్రదించినా ఒప్పుకొని అలియా ప్రభాస్ తో నటించడానికి అంగీకరించింది ఆని వార్తలు రావడం ఒక వైపు సంచలనాన్ని మరొక వైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఏది ఎలా చూసుకున్నా ప్రభాస్ తన కొత్త సినిమాల పై నిర్ణయాన్ని ‘బాహుబలి’ విడుదల తరువాతనే తీసుకుంటాడు అన్నది వాస్తవo..
 



మరింత సమాచారం తెలుసుకోండి: