ఈరోజు ఉదయం మోహన్ బాబు మంచు లక్ష్మి తీసిన ‘దొంగాట’ చిత్రం సక్సెస్ మీట్ లో సినిమా ఇండస్ర్టీ ఎవడబ్బ సొత్తు కాదంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి. తానెప్పుడు చిన్న నిర్మాతల పక్షానే ఉంటానని, చిన్న సినిమాలు తీసే వాళ్లే అసలైన నిర్మాతలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మోహన్ బాబు.

ప్రస్తుతం పరిశ్రమలో మంచి నిర్మాతలు తగ్గిపోయారని, కొందరు పైనాన్షియర్ల సాయంతో భారీ బడ్జెట్‌ సినిమాలు తీసి నటీ నటులకు డబ్బులు ఎగ్గొడుతున్నారని అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు టాపిక్ ఆఫ్ ది డేగా మారాయి. నటీనటులకు పారితోషికాలు ఎగ్గొట్టే నిర్మాతలు దొంగలు అంటూ వారు కాలగర్భంలో కలిసి పోతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు మోహన్ బాబు.

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై త్వరలో తాను స్పందిస్తానని మోహన్ బాబు మరో సంచలన ప్రకటన చేసాడు. అయితే మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు నైజాం ఏరియాకు చెందిన ఓ బడా నిర్మాతకు వర్తిస్తాయని అతని నేతృత్వంలో కొందరు బడా నిర్మాతలు సిండికేట్ అవడం గురించే అంటూ మోహన్ బాబు వ్యాఖ్యలు పై విశ్లేషణలు వస్తున్నాయి.

మండు వేసవిలో మరింత వేడిని పెంచుతూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెనుదుమారాన్ని సృష్టించే అవకాశం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: