చిరంజీవి 150వ సినిమాలో ఒక్క సీన్ లో అయినా కనిపిస్తే చాలు అని చాలామంది భావిస్తూ ఉంటే టాప్ హీరోయిన్ నయనతార మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా మెగా కాంపౌండ్ కు గట్టి షాక్ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి.

2007 తరువాత సినిమాలకు దూరమైన చిరంజీవి రాజకీయాల పై తన మోజు తీరిన తరువాత దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తో తిరిగి మళ్ళీ నటించబోతున్న నేపద్యంలో చిరంజీవికి అన్ని విధాల సరిపోయే హీరొయిన్ గా నయనతారను భావిస్తూ వచ్చారు. ఈ ఉద్దేశ్యంతో ఈమధ్య నయనతారను కలిసిన పూరీ జగన్నాథ్ కు చిరంజీవి 150వ సినిమాలో నటించడానికి తనకు అభ్యంతరం లేదని అయితే తనకు పారితోషికంగా 3 కోట్లు కావాలి అని డిమాండ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి.

దీనితో షాక్ కు గురైన పూరి నయన స్థానంలో మరొకరిని హీరోయిన్ గా పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అయితే రామ్ చరణ్ అభిప్రాయంలో చిరంజీవి పక్కన నయనతార అన్ని విధాల సరిపోతుంది కాబట్టి చరణ్ మాత్రం నయన్ కే ఓటు వేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా ఉన్న రోజులలో ఈ సీనియర్ హీరోలకు ఏర్పడిన హీరోయిన్స్ కరువును నయనతార చాల తెలివిగా ఉపయోగించుకుంటూ కోట్లు గణిస్తోంది. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో మెగా కాంపౌండ్ నయన్ కోరికలను తీరుస్తుoదా లేదా మరొక హీరోయిన్ వేటకు సిద్ధం అవుతుందా అనే విషయం పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: