అక్కినేని అఖిల్ వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న తన తొలి సినిమా స్పెయిన్ వర్కింగ్ స్టిల్స్ హడావిడిగా తన ఫేస్ బుక్ లో పెట్టడం వెనుక పెద్ద కథ నడిచింది అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 

అఖిల్ తల్లితండ్రులు హడావిడిగా స్పెయిన్ వెళ్ళడం అదే సందర్భంలో ఆ సినిమా దర్శకుడు వినాయక్  హైదరాబాద్ వచ్చి త్రిపుర ఫస్ట్ లుక్ ఫంక్షన్ లో అతిధిగా కనిపించడంతో ఈ సినిమా నుంచి వినాయక్ ను దర్శకుడిగా తొలిగించారా? అనే గాసిప్పులు హడావిడి చేసాయి. 

అయితే ఈ గాసిప్పులు అఖిల్ దృష్టి వరకు వెళ్ళడంతో ఖంగారు పడ్డ అఖిల్ ఈసినిమా వర్కింగ్ స్పాట్ లో వినాయక్ ఉన్న ఫోటోలను అదేవిధంగా నాగార్జున అమలలు ఈ సినిమా షూటింగ్ ను చూసి సూచనలను ఇస్తున్న ఫోటోలను తన ఫేస్ బుక్ లో పెట్టి తన సినిమా పై ముఖ్యంగా వినాయక పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు అని ఆ పత్రిక కథనం. అంతేకాదు ఇప్పటి వరకు స్పెయిన్ షూటింగ్ లో జరిగిన విషయాలను నాగార్జున వినాయక్ నుండి వివరంగా తెలుసుకోవడమే కాకుండా పలు సూచనలు కూడ ఇచ్చాడు అని టాక్. 

అఖిల్ తోలిసినిమాకు పూర్తిగా మాస్ సినిమాలను తీసే వినాయక్ దర్శకుడిగా పూర్తి న్యాయం చేయలేడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో వినాయక్ ఈసినిమాను చాల బాగా తీస్తున్నాడు అని అక్కినేని అభిమానులకు వ్యుహత్మకంగా సందేశం పంపడానికి ఒకేసారి అఖిల్ తన స్పెయిన్ షూటింగ్ ఫోటోలను ఇలా ఎక్కువగా తన ఫేస్ బుక్ లో పెట్టి తన ఫోటోల పోస్టింగ్ ను ఒక మిస్టరీ పోస్ట్ గా మార్చాడు అంటూ ఆ ఆంగ్ల దినపత్రిక కథనం..



మరింత సమాచారం తెలుసుకోండి: