‘బాహుబలి’ ఆడియో విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఈసినిమా ఆడియో విడుదల ఫంక్షన్ పై వస్తున్న వార్తలు అందరి మైండ్ ను బ్లాంక్ చేస్తోంది. ఇప్పటికే 3కోట్ల భారీ మొత్తానికి ఈ సినిమా ఆడియో రైట్స్ అమ్మకం జరిగిన నేపద్యంలో ఈసినిమా ఆడియో ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ రైట్స్ ను ప్రముఖ న్యూస్ ఛానల్ టివి5 1.5 కోట్లకు సొంతం చేసుకుంది అనే వార్తలు ఫిలింనగర్ ను షేక్ చేస్తున్నాయి.


ఇప్పటి వరకు దక్షిణాది సినిమాలలో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ కోసం 1.5 కోట్లు పారోతోషికంగా పెట్టిన సందర్భాలు లేవు. ఇంత భారీ మొత్తాన్ని ఒక న్యూస్ ఛానల్ పెట్టుబడిగా పెట్టింది అంటే ఈ ఆడియో ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఎంత భారీ మొత్తాలలో ప్రకటనలు వస్తాయి అన్న విషయం ఎవరి అంచనాలకు అందడంలేదు అని అంటున్నారు.

ఇప్పటికే రాజమౌళి ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ రోజున విడుదల చేయబోతున్న ట్రైలర్ కు సెన్సారింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసాడు అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ ట్రైలర్ ను చూసి సెన్సార్ బోర్డు సభ్యులు ఆశ్చర్య పోయారని టాక్. కోటి రూపాయల ఖర్చుతో నిర్వహించబోతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ పాస్ లకు ఇప్పటి నుంచే విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అని వార్తలు వస్తున్నాయి. 

‘బాహుబలి’ కి రోజురోజుకు పెరిగిపోతున్న క్రేజ్ ను చూసి కాబోలు హీరో సూర్యా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పై కామెంట్ చేస్తూ భారతీయ చిత్ర పరిశ్రమ గర్వింప తగ్గ సినిమాగా ‘బాహుబలి’ మారుతుంది అని అంటూ ‘రాజమౌళి సార్ కనీసం ‘బాహుబలి 2’ లో అయినా ఒక అవకాశం  ఇవ్వండి’ అంటూ సూర్య మరోసారి రాజమౌళిని వేడుకోవడం టాపిక్ ఆఫ్ ది డే..


మరింత సమాచారం తెలుసుకోండి: