ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి ఫోకస్ చిరంజీవి పైనే ఉంది. ఎందుకంటే చిరంజీవి చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న ఫుల్ లెన్త్ మూవీ త్వరలోనే ఉంది కాబట్టి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్టోరి ఫైనలైజ్ అయింది కాబట్టి, సీన్స్ కి సంబంధించిన పనులపై కసరత్తులు జరుగుతున్నాయి.

మొత్తంగా చిరు నటించబోతున్న 150వ సినిమా, కథా పరంగా పక్కా కాన్ఫిడెంట్ ఉంటేనే చిరు ముందుకు అడుగులు వేస్తున్నాడు. అలాగే చాలా కాలం తరువాత వస్తున్న చిత్రం కావడంతో, గతంలో ఉన్న చిరు ఫ్యాన్స్ క్లబ్, అలాగే మెగా ఫ్యాన్స్ క్లబ్స్, మెగాస్టార్ సేవా కార్యక్రమాలు వంటివి తిరిగి యాక్టివేట్ చేయాలని చిరు అభిప్రాయ పడుతున్నారు.

అందుకు తగ్గట్టుగానే దాదాపు మూడు నెలల క్రితమే వాటికి సంబంధించిన వ్యవహారాలను ఓ కొలిక్కి తెచ్చాడు. ఈ విషయంలో చిరంజీవికి, తమ్ముడు నాగబాబు ఎంతగానో సహాయపడుతున్నాడు.

స్యయంగా నాగబాబే ఈ వ్యవహారాలను చూసుకుంటున్నాడు. త్వరలోనే చిరంజీవి 150 సినిమా స్టార్ట్ కాబోతుండటంతో, ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ కావాలంటే ఆ మాత్రం హంగామా అవసరం అని చిరు మెగా ప్లాన్ వేసుకున్నాడు. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో పూర్వ వైభవం కోసం చిరు లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: