త్రిష పెళ్ళి వ్యవహారంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ఆమె పెళ్ళి ఆగిపోయిందనేది మాత్రం నిజం! ఎందుకు ఆగిపోయిందనే దానికి ఓ కారణం బాగా వినిపిస్తోంది. పెళ్ళికొడుకు కుటుంబానికి త్రిషను చేసుకోవడం పెద్దగా ఇష్టం లేదు.

అయినా వరుణ్‌ కోరికను కాదనలేక ఒప్పుకున్నారట! పెళ్ళి తరువాత త్రిష నటించకూడదనే కండిషన్‌ పెట్టారట! ఆ కండిషన్‌తో భగ్గుమన్న త్రిష పెళ్ళి క్యాన్సిల్‌ అనేసి వరుసగా సినిమాలు ఒప్పుకుంటోందట! ఇరు వర్గాల వారు నచ్చచెప్పడాకి ప్రయత్నిస్తున్నారు కానీ త్రిష ఒప్పుకునే ఛాన్స్‌ లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు.

అయితే దీని కన్నా పెద్ద కారణం ఉందని కొందరు అంటున్నారు. త్రిషను వరుణ్‌ అసభ్య పదజాలంతో దూషించాడనీ అది తట్టుకోలేకనే త్రిష పెళ్ళి రద్దు చేసుకుందనీ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వరుణ్ మణియన్ తొడిగిన రింగ్ కూడా త్రిష ధరించటానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదంట.



మరింత సమాచారం తెలుసుకోండి: