పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ ఇంకా సెట్స్ పైకి వెళ్ళకుండానే పవన్ ‘కల్కి’ గా కనిపించ బోతున్నాడు అంటూ హడావిడి మొదలు అయింది. అంతేకాదు దాసరి  పవన్ తో నిర్మించ బోతున్న సినిమా టైటిల్ ఇదే అంటూ వెబ్ మీడియాలో తీవ్ర హడావిడి జరుగు తోంది. అక్టోబర్ లో ప్రారంభం కాబోతున్న పవన్ దాసరిల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా ఉంటుంది అంటూ కొందరు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేసి వెబ్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. 

అంతేకాదు ఈసినిమాకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ మురగదాస్ డైరెక్ట్ చేస్తాడని అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడని కూడా ఊహాగానాలు చేస్తూ ఆ పోస్టర్ పై వారి పేర్లను కూడా వాడేసారు. అంతే కాదు పీటర్ హెయిన్ ఫైట్స్,  ఆనంద్ సాయి ఆర్ట్  అంటూ ఈ సినిమా రేంజ్ ని మరింత పెంచేస్తున్నారు. 

చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి మెగా స్టార్ గా టాలీవుడ్ ను ఏలుతున్న రోజులలో ఇలాంటి ‘కల్కి’ తరహా పాత్రలో ‘రక్త సింధూరం’ అనే సినిమాలో గండ్రగొడ్డలి పాత్రలో కనిపించాడు. ‘కదిలింది కల్కీ అవతారం’ అనే పాట కూడ ఆ సినిమాలో ఉంది. ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కొందరు క్రియేట్ చేసిన ఈ పోస్టర్ వెబ్ మీడియాకు హాట్ టాపిక్ అవ్వడమే కాకుండా పవన్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ టైటిల్ చాల పవర్ ఫుల్ గా ఉంది కాబట్టి దాసరి ఈ ‘కల్కి’ టైటిల్ ను రిజిస్టర్ చేసి పవన్ సినిమాకు వాడినా ఆశ్చర్యం లేదు. 

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ‘గబ్బర్ సింగ్-2’ కోసం పూనే సమీపంలో స్పెషల్ పోలీస్‌ స్టేషన్ సెట్ హీరోయిన్ అనీషా‌తో కొన్ని లవ్‌సీన్స్ త్వరలో తీయబోతున్నారని టాక్. ఇలా ఎలా చూసుకున్నా పవన్ సినిమాల విషయం పై ప్రతిరోజు ఎదో ఒక హాట్ న్యూస్ వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: