‘ఉత్తమ విలన్’ ఘోర పరాజయం చెందినా కమలహాసన్ వేగం తగ్గలేదు. అప్పట్లో ‘ఆకలిరాజ్యం’ అంటూ వచ్చిన కమల్ హాసన్ ఇప్పుడు ‘చీకటి రాజ్యం’ అంటూ మరోసారి సందడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. కమలహాసన్ లేటెస్ట్ 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోసర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. 

ఈ పోస్టర్ లో కమల్ ఘాడంగా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. అయితే ఈ లిప్ లాక్ సీన్ ఈ సినిమాలో కమల్ హాసన్ తో నటిస్తున్న త్రిష కమల్ ల మధ్య చిత్రీకరించిన లిప్ లాక్ అని అంటున్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. 

తెలుగు, తమిళ భాషల్లో తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉంటే  ప్రకాష్ రాజ్ మరో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు.  తమిళంలో ఈ సినిమాకు 'తూంగా వనం' అనే టైటిట్ ఖరారు చేశారు అని టాక్. 

ఓ థ్రిల్లర్ స్టోరీగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా కమల్ నటిస్తూ ఉంటే అతడి భార్యగా ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. ఆమె క్యాన్సర్ వ్యాధి నుండి బయట పడిన తరువాత నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. యంగ్ హీరోలతో సమానంగా లిప్ లాక్ లు చేస్తున్న కమల్ స్పీడ్ అందర్నీ ఆకర్షిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: