టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ‘బాహుబలి’ పెట్టుబడిని కేవలం ఒకే ఒక వారంలో ప్రపంచ వ్యాప్తంగా రాబట్టడానికి ‘బాహుబలి’ యూనిట్ రచించిన ఒక కొత్త మాస్టర్ ప్లాన్ వివరాలను ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక బయట పెట్టింది. ఈసినిమాను అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ మాస్టర్ ప్లాన్ ను రచించారని టాక్.

ఈసినిమా విడుదల అయ్యే జూలై 10వ తారీఖు నుండి మొదటి వారం రోజులు ఈ సినిమా టికెట్స్ ధరను ఇరు రాష్ట్రాలోని ధియేటర్లలోను అధికారికంగా పెంచడానికి ఈ సినిమా నిర్మాతలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారకంగా వినతి పత్రం ఇవ్వడమే కాకుండా ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించడానికి తమ వంతు ప్రయత్నాలను అప్పుడే మొదలుపెట్టేసారని టాక్.

‘బాహుబలి’ యూనిట్ ఆలోచన ప్రకారం ఈసినిమా విడుదలైన తరువాత వచ్చే మొదటి వీక్ ఎండ్ లో మల్టీప్లక్స్ ధియేటర్లలో టిక్కెట్ ను 250 రూపాయలకు అదేవిధంగా సింగల్ స్క్రీన్ ధియేటర్లలో టిక్కెట్ కు ప్రస్తుతం ఉన్నధరకు డబల్ రేటుకు పెంచడానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతిని తీసుకుని మొదటి వారంలోనే ఈ సినిమా వసూళ్ళను రికార్డు స్థాయిలో పెంచడానికి ఈ సినిమా నిర్మాతలు మాస్టర్ ప్లాన్ రచించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రతి 10 సెకన్ల విజువల్ ఎఫెక్ట్ కు దాదాపు 50 వేల దాకా ఖర్చు పెట్టిన నేపధ్యంలో ఈ సినిమా గ్రాఫిక్స్ కే 70 కోట్లు ఖర్చు చేసిన నేపధ్యంలో ఈ సినిమా మొదటి వారం టికెట్ ధర పెంపు అవసరం అని ఈ సినిమా నిర్మాతలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించే పనిలో ఉన్నారని టాక్. టెక్నాలజీయే పెట్టుబడిగా తీస్తున్న ఈ సినిమా నిర్మాణంలోనే కాకుండా మార్కెటింగ్ లో కూడ వండర్స్ ను క్రియేట్ చేయబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: