గత సంవత్సరం టాలీవుడ్ లో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్ అంతా, ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మకాం చేశారు. వారిలో సమంత ఒకరు. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న మూవీలు అన్నీ దాదాపుగా కోలీవుడ్ చిత్రాలే. అయితే తాజగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సమంత సైన్ చేసింది. తను సైన్ చేసిన మూవీలోని హీరోకి సమంత లిక్ లాక్ ఇవ్వనుందనే న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగులో అగ్ర కథానాయికగా గుర్తింపును సంపాదించుకుంది చెన్నై సొగసరి సమంతా. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తరువాత తెలుగులో సినిమాలు తగ్గించుకుంటూ వస్తోన్న ఈ సుందరి తమిళంలో వరుసగా సినిమాల్ని అంగీకరిస్తోంది. కత్తి సినిమాతో అక్కడ విజయాల బాటపట్టిన సమంతా ప్రస్తుతం తమిళంలో ముగ్గురు క్రేజీస్టార్‌లతో నటిస్తూ బిజీగా వుంది. తాజాగా ఆమె మరో చిత్రాన్ని అంగీకరించిందని తెలిసింది.

ధనుష్ కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. వాడా చెన్నై పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన హీరోయిన్ గా సమంతాను ఫైనలైజ్ చేశారు. ఈ విషయాన్ని హీరో ధనుష్ చెన్నైలో అఫిషియల్ గా చెప్పుకొచ్చాడు. పొల్లాదవన్ చిత్రీకరణ సమయంలో వెట్రిమారన్ స్క్రిప్ట్ వినిపించారు.

కథ ఎంతగానో నచ్ఛడంతో వెంటనే వెట్రిమారన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న విఐపీ-2 తరువాత వాడా చెన్నై సెట్స్‌పైకొస్తుంది. అయితే వెట్రిమాన్ దర్శకత్వంలో రాబోతున్న మూవీలో ధనుష్, సమంత ల మధ్య హాట్ సీన్స్ ఉన్నాయంటూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ధనుష్ కి ఆ మూవీలో సమంత లిప్ లాక్ ఇవ్వనుందనే న్యూస్ కోలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: