తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్లు మాంచి ఊపు మీదే ఉన్నారు. రకూల్ ప్రీతిసింగ్, రాశీఖన్నా,రెజీనా లాంటి హీరోయిన్లు ఇప్పటికే మంచి బ్యానర్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. రకూల్ ప్రీతి సింగ్ అయితే ఇప్పుడున్న కుర్రహీరోల మనసు దోచి తమ సినిమాలో ఈ అమ్మడే కావాలనే రేంజ్ కి ఎదిగింది. ఇకపోతే ముద్దుగా బొద్దుగా ఉండే మరో హీరోయిన్ ‘ఉహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది రాశిఖన్నా.


రాశీ ఖన్నా హాట్ ఫోటో


రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తర్వాత మరో చాయిస్‌గా రాశిఖన్నా పేరే వినపడుతోంది. అందం హావభావాలు ఆకట్టుకునే ఫిజిక్ తో ఉండే ఈ అమ్మడు ‘జోరు’ సినిమాలో ఫుల్ గ్లామర్ రోల్ పోషించి తన అందాలతో కుర్రకారు మనసు దోచేసింది. ఇటీవల విడుదలైన గోపీచంద్‌ సినిమా 'జిల్‌' అందం పరంగా, గ్లామర్‌పరంగా, నటనా పరంగా మంచి మార్కులే తెచ్చిపెట్టింది. అంతే కాదు ఈ సినిమాలో లిప్ లాక్ సీన్లో నటించి సోషల్ మీడియాలో ఫుల్ హల్ చల్ చేసింది.  ప్రస్తుతం ఆమె రవితేజ సరసన 'బెంగాల్‌ టైగర్‌' చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది.


రాశీ ఖన్నా హాట్ ఫోటో


తాజాగా ఈ అమ్మడు ఓ నిర్ణయం తీసుకుందట, తను నటించబోయే ఏ హీరో అయినా సరే మెయిన్ హీరోయిన్ గా అయితేనే నటిస్తుందట అంతే కాదు తన రెమ్యునరేషన్ కూడా 50 లక్షలకు దగ్గదట. అంతే మరి అందం ఉన్నంత వరకే ఈ టెక్కులు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కొంత మంది హీరోయిన్ల బాట పట్టింది రాశీఖన్నా


మరింత సమాచారం తెలుసుకోండి: