పవన్ కళ్యాన్ ఈ మధ్య కాస్త వెరైటీగా కనిపిస్తున్నాడు, గడ్డం పెంచుకొని ఓ సాధువు మాధిరిగా కనిపిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన మంచు మనోజ్ వివాహ మహోత్సవానికి కూడా పవన్ గడ్డం పెంచుకొని పైజామా కుర్తా సింపుల్ గా వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇప్పుడు పవన్ పూణే వెళ్తున్నాడు.. ఆ...పూణే అనగా భార్య బిడ్డల కోసం అని మాత్రం అనుకోకండి ఈయన గారు వేరే పనిపై వెళ్తున్నారు. ఈ నెల 29 న గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతుంది అన్న వార్తలు ఇప్పటికే వినిఉన్నారు.

గబ్బర్ సింగ్ 2 ఫ్యాన్స్ మేడ్ పోస్టర్


అవును పవన్ పూణే వెళుతున్నది గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్ కోసం, గబ్బర్ సింగ్ 2 చిత్రం ఈ నెల 29 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది అందుకోసం పవన్ సిద్దమయ్యాడు.  బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే . చాలా రోజుల తర్వాత పవన్ కళ్యా ఓ సినిమా సెట్స్ పైకి వెళుతుంది దీంతో పవన్ అభిమానులు సంతోషంలో మునిగి తెలుతున్నారు. ఈ చిత్రంలో ఇప్పటివరకు హీరోయిన్ గా  అనీష అంబ్రోస్ ని   ఎంపిక చేసారు ,మరొక హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. 
ఒక వారం రోజుల పాటు షూటింగ్ జరుపుకోనున్న ఫస్ట్ షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్ ని ప్లాన్ చేయనున్నారట .



మరింత సమాచారం తెలుసుకోండి: