నందమూరి సింహం బాలకృష్ణ లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయం చిరంజీవిని అలోచింపచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య శ్రీవాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఈనెల 29న ప్రారంభించడమే కాకుండా షూటింగ్ ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అయ్యేడట్లుగా  రెడీ పెట్టమని ఆ సినిమా దర్శక నిఇర్మాతలకు గట్టి సూచనలు ఇచ్చాడు అని వస్తున్న వార్తలు చిరంజీవిని ఆలోచింప చేస్తున్నాయి అని అంటున్నారు. 

తన పుట్టినరోజునాడు మొదలు పెట్టబోయే తన 150వ సినిమాను సంక్రాంతికి విడుదల అవుతుంది అని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఈస్టార్ వార్ కు బాలకృష్ణ ఎందుకు కాలు దువ్వుతున్నాడు అని మెగా కాంపౌండ్ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. 

గతంలో చిరంజీవి బాలకృష్ణల సినిమాలు సంక్రాంతి రేసులో పోటీపడిన సందర్భాలు చాలా ఉన్నా కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి ‘మృగరాజు’ సినిమాకు బాలయ్య ‘నరసింహనాయుడు’ ఇచ్చిన షాక్ గుర్తుకు వచ్చి మెగా కాంపౌండ్ బాలకృష్ణ నిర్ణయం పై తీవ్రంగా ఆలోచనలు చేస్తోంది అనే వార్తలు కూడ వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి నయనతార ఇచ్చిన షాక్ నుండి కోలుకోకుండానే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ దగ్గరకు పూరి చేసిన రాయబారం కూడ విఫలం అయింది అన్న వార్తలు వస్తున్నాయి. 

 కంగన  గతం లో తన సినిమాలో హీరోయిన్ గా నటించిన నేపధ్యంలో పూరి చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా నటించమని పూరి స్వయంగా కంగనా రనౌత్ ను అడిగినా ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్ల సమస్యతో బాధ పడుతున్న చిరంజీవికి బాలకృష్ణ నిర్ణయం మరొక సమస్యగా మారింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: