గతవారం సినిమా పరిశ్రమ ఎవడబ్బ సొత్తు కాదు అంటూ భారీ సినిమా నిర్మాతల సిండికేట్ పై సంచలన వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన మోహన్ బాబు అత్యంత శాంతవంతమైన రూపంతో తన కుమార్తె మంచు లక్ష్మి ముద్దుల కూతురు విద్య నిర్వాణకు పాలు పట్టిస్తూ ఆనందపడుతూ కెమెరాలకు పోజు ఇచ్చిన మోహన్ బాబు లేటెస్ట్ లుక్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈమధ్యనే టాలీవుడ్ సంచలనంగా తన కుమారుడు మంచు మనోజ్ పెళ్లిని అత్యంత ఘనంగా జరిపిన మోహన్ బాబు ప్రస్తుతం తన మనవరాలుతో ఇలా రిలాక్స్ అవుతున్నాడు అనుకోవాలి.  మొన్నటివరకూ తన పెద్ద కుమారుడు మంచు విష్ణు కుమార్తెలు అరియానా, ఇరియానా లతో కాలం సరదాగా కాలక్షేపం చేసిన మోహన్ బాబుకు విద్యా నిర్వాణ క్యూట్ లుక్స్ బాగా నచ్చడంతో ఇలా అసలైన తాతయ్యలా మారిపోయాడు అనుకోవాలి. 

ఈ వార్తలు ఇలా ఉండగా మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు నిన్న వెబ్ మీడియాలో తన అభిమానులతో తన ఫేస్ బుక్ ద్వారా సంభాషిస్తూ మరో సంచలన విషయాన్ని బయట పెట్టాడు అని వార్తలు వినపడుతున్నాయి. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని విష్ణు బయట పెట్టాడు. 

త్వరలోనే మంచువారి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రావణ’ కు శ్రీకారం పడబోతోందని ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ‘రావణ’ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి అవుతున్న నేపధ్యంలో మోహన్ బాబు రావణాసురుడుగా కనిపించడం ఖాయం అని చెప్పడమే కాకుండా రాముడిగా తాను నటించడానికి తన తండ్రి అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ మరో సంచలన విషయాన్ని బయట పెట్టాడు. అయితే రావణుడు గా మోహన్ బాబును చూడగలిగిన తెలుగు ప్రేక్షకులు రాముడు గా మంచు విష్ణు ను చూడగలరా అన్నదే ప్రశ్న.. 



మరింత సమాచారం తెలుసుకోండి: