సినిమాలో కనీసం ఒక్క చిన్న పాత్ర అయినా సరే కనిపిస్తే చాలు జన్మధన్యమైపోతుంది అనుకునేవారు చాలా మంది ఉంటారు. సినిమాలో నటించడానికి తమ ఆస్తిపాస్తులు అమ్ముకొని స్టూడియోల చుట్టూ చక్కర్లు కొట్టేవారుకూడా ఉన్నారు. సినిమా అంటే అతడికి ప్రాణం, సినిమాలో నటించాలన్నదే అతడి ధ్యేయం.. అదే ఆయన జీవితాన్ని అర్థంతరంగా ముగించేయడానికి కారణం అయ్యింది. సిద్ధాపుర అనే సినిమాలో నటిస్తున్న కన్నడ హిరో రామ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.


సిద్దాపుర షూటింగ్ టైమ్ లో రామ్, హీరోయిన్లు


ఈ సినిమా ప్రారంభంలో ఉరుకులు పరుగులు పెట్టినా మధ్యలో నిర్మాత శ్రీనివాస్ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేతులెత్తేశాడు. సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఎలాగైనా సినిమా పూర్తి థియేటర్లో నడిపించాలనే పట్టుదలతో రామ్  కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకుని సినిమా నిర్మాణంలో పెట్టాడు. చివరికి ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసినా సినిమా పూర్తి కాలేదు. దీంతో, కుంగిపోయిన రామ్ ఆత్మహత్యకు యత్నించాడు.


తను అనుకున్నది సాధించలేక పోయా అని స్నేహితులతో చెప్పుకొని బాధపడేవాడు అదే సమయంలో స్నేహితులతో మాట్లాడూతూనే విషం సేవించి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. అతడిని వెంటనే నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: