విశ్వ నటుడు కమల్ హాసన్ ఈ సంవత్సరం సినీసందడి బాగా చేస్తున్నాడు. ఈ మద్య ఎన్నో ఆటో పోట్లు ఎదుర్కొని విడుదలైంది విలన్ సినిమా, అలాగే మరో పక్క, కమల్ “విశ్వరూపం 2″ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న “దృశ్యం” సినిమా తమిళ్ వెర్షన్ లో కమల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తమిళ్ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు.  ఈ సినిమా టైటిల్ మాత్రం అక్కడ ‘దృశ్యం” కాదట. అక్కడ ఈ సినిమా “పాపనాశం”గా తెరకెక్కబోతోందని సమాచారం, కమల్ సరసన గౌతమి నటిస్తుంది.

పాపనాశం లో ఓ దృశ్యం..


తాజాగా ‘చీకటి రాజ్యం’ అనే సినిమా  ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు కమల్. ఈ పోస్టర్ చూడగానే కమల్ హాసన్ హీరోయిన్ ముఖం  చూపకుండా ముద్దు పెట్టుకునే పోస్ట్రర్ అందరిలో హాట్ టాపిక్ గా నిలిచింది. తర్వాత చేతిలో గన్ పట్టుకొని నడుస్తున్న స్టిల్ ఇది క్రైమ్, థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. అయితే ఈ సినిమా కథ గురించి తమిళం అప్పుడే ఊహాగానాలు మొదలైనాయి అక్కడ అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో కమల్ ఒక సీరియల్ కిల్లర్ అట, అందమైన ముద్దుగుమ్మల్ని ట్రాప్ చేసి ముద్దు పెట్టి చంపే కథ అని అనుకుంటున్నారట.

విశ్వరూపం 2 సినిమా పోస్టర్


కాకపోతే ఈ సినిమాల తను  పోలీస్ అధికారిగా చేస్తున్నట్లు కమల్ ప్రకటించారు. మరి సీరియల్  కిల్లర్ గా, పోలీస్ అధికారిగా రెండు యాంగిల్ లో కథ ఉంటుందేమో అని కొందరంటున్నారట.  స్క్రీన్ ప్లే ప్రధాన చిత్రం అని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందో కానీ పోస్టర్ ని చూసి కథ అల్లిసినట్లు మాత్రం అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: