చిత్ర పరిశ్రమలోకి ఎంటర అయిన తర్వాత  ఏ చిన్న చాన్స్ వచ్చినా వదిలిపెట్టకుండా చేస్తారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నిండుగా గ్లామర్ ఒలకబోసే కథానాయికలు మాత్రమే మనగలుగుతారు. ఒక్క సారి హీరోయిన్ గా  ఫిల్మా ఇండస్ట్రీలో చోటు దక్కిందంటే వారి సంతోషాలకు ఆనందాలకు అడ్డూ అదుపు ఉండదు. ప్రేక్షకుల మనసు దొచే హీరోయిన్లకు ఇండస్ట్రీలో తీరుగే ఉండదు, అలాంటి హీరోయిన్లలో లక్ష్మీమీనన్ ఒకరు.

లక్ష్మీమీనన్


ఈ అమ్మడు సినిమాల్లో మంచి ఫామ్ లో ఉండగా ప్లస్ టూ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావాల్సి వచ్చింది దీంతో అన్నీ పక్కకు పెట్టి దీక్షగా చదివింది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.  సాధారణంగా చిత్రప రిశ్రమలోకి వచ్చిన తరువాత కెరియర్ మంచి ఊపుతో ముందుకుసాగుతుండగా ఎవరూ ఎక్కడా గ్యాప్ రానీయరు, కానీ హీరోయిన్ లక్ష్మీమీనన్ మాత్రం చదువుకు ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవడానికి సమయం తీసుకుంది. ఆమె పరీక్షలు రాయడం పూర్తి చేసేంత వరకూ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాచుకుని వుండటం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: