‘లెజండ్’ లాంటి సూపర్ సక్సస్ అందుకుని సంవత్సరం దాటి పోయినా ఒక్క స్టార్ హీరోతో ఒక్క సినిమాను కూడ తియ్యలేక పోయిన బోయపాటి పరిస్థితి చాలామంది దర్శకులకు అర్ధంకాని విషయం. లెజెండ్ తరువాత మెగా కుటుంబం చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి బెల్లంకొండ శ్రీనుతో సినిమాను మొదలు పెడితే ఆ సినిమా పనులు కేవలం ఆ సినిమా పూజా కార్యక్రమాలతోనే ఆగిపోయాయి. 

అయితే ఏదోవిధంగా తన కథకు చరణ్ కాకపోయినా బన్నీ అయినా ఒప్పుకున్నాడని బోయపాటి సంతోషిస్తే ఇప్పుడు ఆ సినిమాను తీస్తున్న అల్లుఅరవింద్ సూచనలతో బోయపాటి బన్నీతో తీయబోతున్న సినిమా కథ పై రకరకాల మార్పులు చేస్తున్నాడు. అన్నీ కుదిరితే ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది.

కానీ ఈసినిమా కథ విషయమై అల్లుఅర్జున్ అరవింద్ లు ఇంకా పూర్తిగా సంతృప్తి చెందలేదు అనే వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టి మరెప్పుడు పూర్తి చేయాలి అని బోయపాటి టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా మరో టెన్షన్ బోయపాటికి మొదలైంది అని టాక్.లేటెస్ట్ గా ‘లయన్’ సినిమా ఇచ్చిన షాక్ తో బాలకృష్ణ భవిష్యత్ లో కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడం ఇష్టం లేక తనకు రెండు సూపర్ హిట్స్ ను ఇచ్చిన బోయపాటిని తన 100వ సినిమా కథ విషయమై స్పీడ్ ను పెంచి ఒక మంచి కథను తయారుచేసుకు రమ్మని బోయపాటికి బాలయ్య సూచించాడు అని ఫిలింనగర్ టాక్.

బోయపాటికి ఇది ఊహించని అదృష్టం అయినప్పటికీ ఒక వైపు అల్లుఅరవింద్ అజమాయిషీలో బన్నీతో అల్లు కాంపౌండ్ కోరుకున్న విధంగా సినిమా తీస్తూ ఇప్పుడు హడావిడిగా బాలయ్యకు కథలు ఎక్కడ వినిపించేది అని బోయపాటి శ్రీను తన సన్నిహితుల వద్ద తల పట్టుకుంటున్నాడని టాక్. ఈ వార్తలు విన్న కొందరు బోయపాటి ప్రస్తుతం అల్లు కుటుంబం నందమూరి సింహం మధ్య బంతి లా మారాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: