చిరంజీవి లండన్ లో బిజీగా కాలం గడుపుతుంటే బండ్ల గణేష్ మాత్రం చిరంజీవి 150వ సినిమా మొదలు కాకుండానే తిరుపతిలో మొక్కు తీర్చుకున్నట్లుగా అర్ధం అవుతోంది. టాలీవుడ్ లో అతితక్కువ కాలం లో స్టార్ ప్రొడ్యూసర్ స్టేటస్ అందుకున్న బండ్ల గణేష్ మెగా కుటుంబానికి వీరవిదేయుడు. 

మెగా హీరోలు అందరితో సినిమాలు చేసిన బండ్ల గణేష్ తన కలలు నెరవేర బోతున్నందులకు మంచి జష్ పై ఉన్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి 150వ సినిమాకు రామ్ చరణ్ పక్కన సహాయం చేసే సహా నిర్మాత గా అవకాశం దాదాపు ఖాయం కావడంతో తిరుపతి వెళ్ళి తన మొక్కును తీర్చుకుని ఇలా నున్నటి గుండుతో ‘నమో వెంకటేశా నమో తిరుమలేశా' అంటూ ఓ కామెంట్ తగిలించి తన గుండు ఫోటోను తన ట్విటర్ లో  పోస్టు చేసి హడావిడి చేస్తున్నాడు బండ్ల గణేష్. 

గత సంవత్సరం రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ ఈ సంవత్సరం జూనియర్ తో ‘టెంపర్’ సినిమాలను తీసినా అవి ఏమి బండ్ల గణేష్ కోరుకునే బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోవడంతో ఇప్పుడు ఆ ఆశలన్నీ చిరంజీవి 150వ సినిమా పైనే పెట్టుకుని రోజులు లెక్క పెడుతున్నాడు ఈ క్రేజీ ప్రొడ్యూసర్. 

మరి చిరంజీవి తన 150వ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడానికి బండ్ల గణేష్ కోరికను తీర్చి రామబంటు లా మెగా కుటుంబానికి బండ్ల గణేష్ ను వినియోగించుకుంటాడో లేదో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: