తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తీసే సినిమాలు చాలా రిచ్ గా దాదాపు గ్రాఫిక్స్ టెక్నాలజీకి సంబంధించినవే ఎక్కువ ఉంటాయి. కొత్త కొత్త టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలో మనోడికి వెన్నతో పెట్టిన విద్య. జక్కన్న తీసిన ‘బాహుబలి’ చిత్రం దాదాపు గ్రాఫిక్స్ పైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. పాత్రల ఔచిత్యాన్ని బట్టి ఈయన గ్రాఫిక్ టెక్నాలజీ వాడుతాడు. మొన్నటి మొన్న ‘ఈగ’ సినిమా తీసి అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులకు అందించాడు.  తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తీసిన ‘బాహుబలి' సినిమాకు సంబంధించి బయటకు పొక్కుతున్న విషయాలు ఒక్కొక్కటి ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.


ఈ మధ్య విడుదల చేసిన బాహుబలి క్యారెక్టర్స్ ఫోటోలు


ఈ చిత్ర నిర్మాణానికి పెట్టిన పెట్టుబడి చూస్తూ అందరూ వామ్మో అనుకోవాల్సిందే మరి ఈ చిత్రంలో కేవలం గ్రాఫిక్స్ కోసమే రూ. 70 కోట్ల మేర ఖర్చు చేసారట. నేషనల్ అవార్డు విన్నర్, ‘మ్యాజిక్ మ్యాజిక్', ‘శివాజి', ‘రోబో' చిత్రాలకు సూపర్ వైజింగ్ చేసిన విఎఫ్ఎక్స్ ఎక్స్‌పర్ట్ శ్రీనివాస్ మోహన్ ‘బాహుబలి' చిత్రానికి కూడా పని చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం దాదాపు ఆరు వందల మంది గ్రాఫిక్స్ నిపుణులు ఏకబిగిన పని చేశారట.


బాహుబలి రాజ ఆస్థానానికి సంబంధించిన సెట్టింగ్


ఒకప్పుడు కోడీ రామకృష్ణ తన సినిమాలో గ్రాఫిక్స్ చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు అమ్మోరు, దేవి సినిమాలో కొంత వరకు గ్రాఫిక్స్ తోనే జనాలను ఆకర్శించగలిగాడు.   సాధారణంగా 10 సెకన్ల నిడివిగల విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసం రూ. 50 వేలు ఖర్చవుతుంది. బాహుబలి సినిమాలో 95 శాతం గ్రాఫిక్స్ మాయాజాలమే. వాస్తవానికి గ్రాఫిక్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు చాలా ఇష్టపడుతుంటారు  అందుకే నిర్మాతలు ఏ మాత్రం వెనకాడకుండా రూ. 70 కోట్లు గ్రాఫిక్స్ కోసం ఇప్పటికే ఖర్చు చేసారు.ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టులు ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జులై 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి జక్కన్నా మజాకా.

మరింత సమాచారం తెలుసుకోండి: