ఈవారం మహేష్‌‌బాబు విజయవాడలో తన కొత్త సినిమా షూటింగ్‌‌‌ని ప్రారంభిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మే 31 శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో మహేష్ చేస్తున్న ‘బ్రహ్మోత్సవం’ మూవీ షూటింగ్ విజయవాడలో ప్రారంభం కాబోతోంది బెజవాడ బ్యాక్ ‌‌‌డ్రాప్‌ ‌‌లో ఈ సినిమా కధ కొంత పార్ట్ ఉండటంతో ఈ సినిమాను మొట్టమొదట విజయవాడలో ప్రారంభిస్తున్నారు.

ఈ ఏర్పాట్లకోసం యూనిట్ సభ్యులు, డైరెక్టర్ శ్రీకాంత్,  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి మొదలగువారు ఇప్పటికే  కనకదుర్గ టెంపుల్,  ప్రకాశం బ్యారేజ్, కాళేశ్వరరావు మార్కెట్,  యనమలకుదురు తదితర లోకేషన్స్‌‌ను షూటింగ్ ఏర్పాట్ల కోసం చూసారని తెలుస్తోంది. 

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీకోసం భద్రాచలం రామాలయంలో ముకుంద సినిమాకోసం ద్రాక్షారామం టెంపుల్ లో కొన్ని ముఖ్యసన్నివేశాలు షూట్ చేసిన శ్రీకాంత్ ఈసారి విజయవాడ ‘దుర్గగుడి’ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయబోతునట్లు టాక్. అదేవిధంగా ఈ సినిమాలో సెంటిమెంట్‌ ‌తోపాటు బెజవాడ మార్క్ రౌడీయిజం, పగ ప్రతీకారాలు కూడా ఉంటాయని ఇన్ సైడ్ టాక్.  హీరోయిన్ ఇంకా ఖరారు కాని ఈ మూవీకి మిక్కీ జె మేయర్ అందించ బోతున్నాడు. 

అయితే బెజావాడ మార్క్ రౌడీయిజం, పగ ప్రతీ కారాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చిన నేపధ్యంలో మళ్ళీ అటువంటి కథ శ్రీకాంత్ అడ్డాల ఎందుకు ఎంచుకున్నాడు అని చాలా మంది ఆశ్చర్య పోతున్నట్లు టాక్. శ్రీకాంత్ అడ్డాల ‘ముకుంద’ ఫెయిల్యూర్ తరువాత తీస్తున్న సినిమా కావడంతో మహేష్ పై ఈ ప్రయోగం ఫలితం ఎలా ఉంటుందో అనే మాటలు వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: