తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త రూపం దాల్చనున్నారు అదేనండి హీరో రజిని కాంత్ ఇప్పుడు విలన్ గా మారనున్నాడు. కాకపోతే తమిళ నాట కాదు బాలీవుడ్ సినిమాలో మాత్రమే. వాస్తవానికి రజినికాంత్ కొత్తలో విలన్ గా కూడా నటించారు. తర్వాత హీరోగా జనహృదయాల్లో నిలిచిపోయాడు, మరి సడెన్ గా విలన్ గా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందీ అంటే దానికి ఒక కారణం ఉంది. షారూఖ్ అంటే రజనీకి ఇష్టమే. అందుకే షారుక్ నటించిన 'రా. వన్'లో ఒకే ఒక్క సన్నివేశంలో కనిపించడానికి అంగీకరించారు రజనీ. ఇప్పుడు ఈ ఇద్దరూ హీరో, విలన్లుగా తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం 'రోబో-2' లో నటించనున్నారని సమాచారం.  


రోబో సినిమాలో రజినీకాంత్

Rajani Villan in Shahrukh Khan's  'Robot 2'

 రజనీకాంత్, శంకర్ దర్శకత్ంలో రూపొందనున్న రోబో 2 చిత్రంలో   విలన్ గా చేస్తున్నాడంటూ  తమిళనాట వార్తలు వస్తున్నాయి. అయితే అది తమిళ, తెలుగు వెర్షన్స్ కోసం కాదని అంటున్నారు. కేవలం హిందీ వెర్షన్ లోనే రజనీ విలన్ గా కనిపించి అలరిస్తాడంటున్నారు. రజినికి తమిళ, తెలుగులో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆ సినిమాలో హీరోగా చేస్తారు....మరి ఆయనకు విలన్ ఎవరూ అంటే షారూఖ్ ఖాన్ అంటున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: