రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘బాహుబలి’ ఈ నెలలో చిత్రానికి సంబంధించిన పాత్రలు వాటి ఫస్ట్ లుక్ విడుదల చేసి సినిమాపై మంచి హైక్ నే తెప్పించాడు. ఇంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్ర ఆడియో వేడుకలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోండి, నిజమే ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ సినిమా చరిత్రలోనే అదిరిపోయేలా క్రియేట్ చేస్తామని రాజమౌళి అంటున్నారు. ఈ నెల 31 న జరగనున్న 'బాహుబలి' చిత్రం ఆడియో పంక్షన్ కు మరి చీఫ్ గెస్ట్ ఎవరూ అన్న ప్రశ్న తలెత్తుతుంది, ఈ లీస్టులో  చిరంజీవి, రజనీకాంత్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ హాజరవుతారని వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే.

బాహుబలి చిత్రంలో  శివుడిగా  ప్రభాస్


మరో వార్త ఎంటంటే ఈ చిత్రంలో సినిమాకు సంబంధించిన మెయిన్ క్యారెక్టర్స్ తప్ప వేరే ఎవరూ ఉండరని మరో వార్త వినిపిస్తుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రాజమౌళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది అంతే ఆయనకి కూడా  అందరు స్టార్ హీరోలు, సీనియర్ హీరోలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ వర్షన్ లో తీస్తున్నారు కాబట్టి ఆయా ఇండస్ట్రీలో అగ్ర హీరోలను పిలవాలనే ప్రయత్నం చేస్తున్నాడా..? లేదా తెలుగు సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని ఒక్కరిని పిలిచి ప్రోగ్రామ్  కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ఒకసారి, లేదు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చీఫ్ గెస్ట్ అయితే వెరైటీగా ఉంటుందని మరోసారి అసలు చీఫ్ గెస్టు లేకుండా ఆడియో ఫంక్షన్ జరిపిద్దామనే ఆలోచనలో మరో వైపు ఇలా ఆడియో ఫంక్షన్లో చీఫ్ గెస్టుపై తర్జన భర్జన జరుగుతున్నాయి. మొత్తానికైతా అంత పెద్ద ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్టు లేకుంటే చీఫ్ గా ఉంటుందని ఒక్క ఛీఫ్ గెస్ట్ నే పిలుద్దాం..అది రజనీనో, చిరంజీవో లేక అక్షయ్ అనేది తేలుతుంది. రజనీ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

బాహుబలికి సంబంధించిన పోస్టర్లు..


ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను, ఆడియో ను మే 31 న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: