ప్రస్తుతం వర్మ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.  ఎందుకంటే తను ఓ సెక్స్ ఫీల్మ్ కి డైరెక్టర్ గా మారబోతున్నాడంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో హాట్ న్యూస్ గా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో వర్మ చాలా సీరియస్ అయ్యాడు. ఇక వివరాల్లోకి వెళితే, ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలతో, సినిమాల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మపై సహజంగానే రకరకాల పుకార్లు వినిపిస్తూ ఉంటాయి.

తనపై వచ్చే చిన్న చిన్న పుకార్లను నవ్వుతూ కొట్టిపడేసే వర్మ, తాజాగా ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త చూసాక మాత్రం కొంచెం ఘాటూగానే స్పందించారు. రామ్ గోపాల్ వర్మ ఓ పోర్న్ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడన్నది ఆ వార్త సారాంశం. దీనిపై సీరియస్‌గా స్పందించిన వర్మ, “నేను ఒక అడల్ట్ సినిమా చేస్తున్నాన్నది నాన్సెన్స్ న్యూస్.

ఒక జర్నలిస్ట్ ఇలాంటి వార్త రాసేముందు కనీసం చెక్ చేసుకోవాలి”అన్నారు.  అయితే ఈ వార్తను ప్రచురించిన జర్మలిస్ట్ ని వర్మ డైరెక్ట్ గా ఫోన్ చేసి మందలించాడనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో అదే జర్మలిస్ట్, వర్మపై పలు సందర్భాల్లో..పలు రకాలుగా వివాదాస్పద వార్తలు రాయటం జరిగిందట.

అందుకే వర్మ ఆ జర్నలిస్ట్ ని ఈసారి పట్టుకొని, తన తడాఖ చూపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘మొగలి పువ్వు’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘అటాక్’ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: