కలర్ ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారి అవకాశం వస్తే చాలు. ఇక పంట పండినట్టే. మొదటి అవకాశానికే అద్రుష్టం కలిసి వస్తే, ఇక తన స్టార్ డంని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఇక ఆ యాక్టర్స్ అడిగే డిమాండ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో, అలాగే నిర్మాతలకి ఏ విధమైన చుక్కలు చూపిస్తారో? పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు సరిగ్గా టాలీవుడ్ కి చెందిన కుర్రహీరో ఆ విధంగా వ్యవహరిస్తున్నాడంట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను  మెప్పించిన యంగ్ హీరో రాజ్ తరుణ్... తన రెమ్యూనరేషన్ తో చాలామంది నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడట. ఉయ్యాల జంపాల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కొత్త హీరో... ప్రస్తుతం దర్శకుడు  సుకుమార్ నిర్మిస్తున్న కుమారి 21 ఎఫ్ తో పాటు సినిమా చూపిస్త మావ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ కుర్రాడితో సినిమా చేసేందుకు ముందుకొచ్చిన కొందరు నిర్మాతలు.. ఇతగాడు డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ గురించి విని హడలిపోతున్నారట.

ఒకే ఒక్క హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం  సినిమాకు అక్షరాల కోటి రూపాయల రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడట. తాను కోరినంత రెమ్యూనరేషన్ ఇస్తేనే.. కొత్త సినిమాలకు కమిటవ్వాలనే ఆలోచనలో కుర్ర హీరో ఉన్నట్టు సినీ జనం  గుసగుసలాడుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: