నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా తర్వాత రాబోయే సినిమాలపై చాలా కేర్ ఫుల్ గా స్టెప్ వేయాలనుకుంటున్నాడు. కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడితో సినిమా తీయాలనుకున్నాడు. ఎన్టీఆర్ తర్వాత చిత్రం సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి, కాకపోతే ఈ సినిమా సెట్స్ పైకి ఇప్పుడా అప్పుడా అన్నట్లు సాగుతుంది. తాజాగా  జూన్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుంది.

గడ్డంతో ఎన్టీఆర్ న్యూ లుక్


ఇప్పటికే దీనికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తీ అయ్యాయని, ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరగనుందట. ఈ సినిమాకు టెంపర్ డైలాగ్ దండయాత్ర అని టైలిల్ అనుకున్నారు కానీ సినిమా పరంగా చూస్తే బాగాలేదని టైటిల్ మార్చారు మా నాన్నకు ప్రేమతో సినిమా టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ తో కనిపించనున్నాడు. అందుకే ఎన్టిఆర్ తన గడ్డాన్ని భారిగా పెంచినట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీతీ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: