సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకి కోపం వచ్చింది...అయితే ఈసారి కోపం తను ట్విట్స్ చేస్తున్న కామెంట్లపై వస్తున్న విమర్శలపై కాదట..  వర్మ పై  తాజాగా ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త చూసాక మనోడు కొంచెం ఘాటూగానే స్పందించారు. రామ్ గోపాల్ వర్మ ఓ పోర్న్ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడంటూ అందులో వార్త వచ్చింది.  ఓ ఫోర్న్ భామతో పూర్తిగా శృంగారభరిత సినిమా తీసేందుకు వర్మ సిద్దంగా ఉన్నాడంటూ వార్త సంచలనం రేపింది.


దర్శకుడు రాంగోపాల్ వర్మ

1

అంతే కాదు ఆ సినిమా ఇండియాలో అనుమతించరని అమెరికాలో షూటింగ్ తో పాటు రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి... దీంతో చిర్రెత్తుకొచ్చిన రాంగోపాల్ వర్మ పలక్ నామాకే పంచ్ లా అన్నట్టు ఎప్పుడూ ఏదో సంచలనాలు రేపే తనపై సంచలనాత్మకమైన న్యూస్ రావడంతో కాస్త ఘాటుగా స్పందించాడు..  నేను ఒక అడల్ట్ సినిమా చేస్తున్నాన్నది నాన్సెన్స్ న్యూస్. ఒక జర్నలిస్ట్ ఇలాంటి వార్త రాసేముందు కనీసం చెక్ చేసుకోవాలి  అన్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘మొగలి పువ్వు’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘అటాక్’ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: