హేరిస్‌ జైరాజ్‌ సంగీత సారధ్యం వహించగా, వనమాలి సాహిత్యంతో ఆడియో విడుదల జరుపుకొన్న ‘శీనుగాడి లవ్‌స్టోరి’ తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకొంది. నయనతార`ఉదయనిధి స్టాలిన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ‘క్లీన్‌ యు’ సర్టిఫికెట్‌ లభించింది. ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తుండడం తెలిసిందే.

శీనుగాడి లవ్‌స్టోరి ఓ దృశ్యం


  సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రాన్ని జూన్‌ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. నయనతార గ్లామర్‌, సంతానం కామెడి, హేరిస్‌ జైరాజ్‌ సంగీతం, ఉదయనిధి స్టాలిన్‌ నటన మరియు నిర్మాణ విలువలు ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి తెలుగులో ‘క్లీన్‌ యు’ సర్టిఫికెట్‌ లభించడం ఇక్కడ కూడా ఈ చిత్రం సాధించబోయే సంచలన విజయానికి సంకేతమంటూ రామసత్యనారాయణ సంతోషం వ్యక్తం చేసారు!!


మరింత సమాచారం తెలుసుకోండి: