రానున్న ఆదివారం మే 31న జరగవలిసి ఉన్న ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక అధికారిక సమాచారం ఈరోజు ఉదయం విడుదల అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. 

విశ్వసనీయ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం మేరకు ‘బాహుబలి’ ఆడియో విడుదలకు పోలీసు డిపార్ట్ మెంట్ ఈ ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలోని ఓపెన్ గ్రౌండ్ లో పెట్టుకోవడానికి అంగీకరించడం లేదు అని వార్తలు వస్తున్నాయి. 

గతంలో జూనియర్ నటించిన ‘బాదుషా’ సినిమా ఆడియో వేడుకలో జరిగిన సంఘటనలో ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోయిన నేపధ్యంలో అప్పటి నుంచి బహిరంగ ప్రదేశాలలో సినిమా ఆడియో ఫంక్షన్స్ పెట్టుకోవడానికి పోలీసు శాఖ ఒప్పుకోవడం లేదు అనే వార్తలు కూడా ఉన్నాయి. 

అదీకాకుండా మే 31 ఆదివారం కావడంతో జనం విపరీతంగా వస్తారు కాబట్టి ఓపెన్ గ్రౌండ్ లో ఈ ఫంక్షన్ నిర్వహిస్తే జనాన్ని కంట్రోల్ చేయడం చాల కష్టం అని పోలీసు శాఖ వారు చెపుతున్నట్లు సమాచారం. ఈ వార్తల నేపధ్యంలో ఈ ఆడియో ఫంక్షన్ జూన్ 3 లేదా 8వ తారీఖుకు వాయిదా పడే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ వార్తలే నిజం అయితే ప్రభాస్ అభిమానులకే కాకుండా ఇది అందరికీ షాకింగ్ న్యూస్ అనుకోవాలి. ఏది ఎలా ఉన్నా ఎదో కారణంతో ‘బాహుబలి’ అన్నీ బ్రేక్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: