మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ తయారుచేసిన కథలో చిరూ ‘ఆటో జానీ’ గా కనిపిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే అయినా ఈ సినిమాలో చిరంజీవి 40 సంవత్సరాలు దాటిన పెళ్ళి కాని మధ్య వయస్కుడిలా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కనిపిస్తాడు అని టాక్.

40 సంవత్సరాలు దాటిపోయిన ముదురు బ్రహ్మచారిలా ఈ సినిమాలో కనిపించే చిరంజీవి తనకు తగ్గ జోడీ కోసం వెతుకుతూ చేసే అల్లరి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ కథలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఈ పాత్ర స్వభావ రీత్యా చిరంజీవికి హీరోయిన్ గా నయనతార లేదా అనుష్క అయితే బాగుటుందని ప్రయత్నిస్తున్నా వారి డేట్స్ ఇవ్వలేక పోవడంతో పూరి చిరంజీవికి తగ్గ హీరోయిన్ విషయమై ఇంకా ఒక స్పష్టమైన క్లారిటీకి రాలేకపోతున్నాడు అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాలో చిరంజీవి నటించబోయే క్యారెక్టర్ పై గతంలో చిరూ నటించిన ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ స్టైల్స్ మరియు క్యారెక్టర్ల ప్రభావం పూరి తీయబోతున్న ‘ఆటో జానీ’ లో కనిపిస్తుంది అనే కొత్త ప్రచారం ఫిలింనగర్ లో ఊపు అందుకుంది. చిరంజీవి ఈ నెలాఖరుకు తన లండన్ ట్రిప్ నుండి తిరిగి వస్తున్న నేపధ్యంలో జూన్ మొదటి వారంలో చిరంజీవి పూరీలు కలిసి ‘ఆటో జానీ’ క్యారెక్టర్ కు ఫైనల్ టచ్ ఇస్తారు అని తెలుస్తోంది. 

ఈ క్యారక్టర్ స్వభావం బట్టి సంభాషణలు వ్రాయవలసి ఉంటుంది కాబట్టి చిరంజీవి ‘ఆటో జానీ’ గా ఎలా కనిపించాలి అనుకుంటున్నాడు అన్న విషయం పై క్లారిటీ వచ్చిన తరువాత ఈ కథకు డైలాగ్స్ వర్షన్ పై పూరి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: