కింగ్ ఫిషర్ క్యాలెండర్ హాట్ బ్యూటీగా పేరు గాంచిన పూనమ్ పాండే 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్ గా కనిపిస్తాను అంటూ బహిరంగ ప్రకటన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే క్రికెట్ బోర్డ్ ఆమె అభ్యర్ధనను మన్నించక పోవడంతో ఆమె కోరిక నెరవేరలేదు. అయితే 2012లో కలకత్తా నైట్ రైడర్స్ ఐపిఎల్ టార్న్ మెంట్ విజేతలుగా నిలిచినప్పుడు ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తన అర్ధనగ్న ఫోటోలను తన ట్విటర్ ఎకౌంట్ లో పెట్టి నానా హడావిడి చేసింది. 

ఆ తరువాత ఆమె ‘నిషా’ అనే బాలీవుడ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ గా ఎదుగుదామని అప్పటి నుంచి తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆమెకు హాట్ బ్యూటీగా బాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి పూనమ్ తన హాట్ ఫోటో షూట్లతో ఎప్పుడూ మీడియాకు హాట్ టాపిక్ గానే కొనసాగుతూ వస్తూనే ఉంది. 

తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పూనమ్ మరో సినిమాను బాలీవుడ్ లో తానే స్వయంగా నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఈమధ్య చాలామంది బాలీవుడ్ యంగ్ హీరోలను తనతో సినిమాలలో నటించమని అడుగుతోందని టాక్. అయితే పూనమ్ పేరు వినగానే ఆ యంగ్ హీరోలు అంతా పారిపోతున్నారట. దీనితో ఇక లాభం లేదనుకుని పూనమ్ తానే స్వయంగా రంగంలోకి దిగి కొత్త కుర్రాళ్ళ ఎంపిక పై ఫోకస్ పెట్టింది. 

తన సరసన నటించే చాన్స్ ఎవరు కొట్టేస్తారు అంటూ ఒక విడియో తయారుచేసి యూట్యూబ్ లో పెట్టింది. ఈ వీడియో చూసి దాదాపు 25 వేలమంది యువకులు తమ యాక్టింగ్ స్కిల్స్ చూపెడుతూ తాము పూనమ్ తో రోమాన్స్ చేయడానికి రెడీ అంటూ పూనమ్ కు వీడియోలు పంపడంతో ఇన్ని వేలమందిలో తనతో రొమాన్స్ చేసే హీరోని ఎలా ఎంచుకోవాలి అని తల పట్టుకుంటోంది పూనమ్. ఆమె క్రేజ్ ఇప్పటికైనా బాలీవుడ్ లోని  హీరోలకు తెలిసి వచ్చింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: