ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముద్దుల తనయుడు నారా లోకేష్ బాబు, నందమూరి బాలకృష్ణ పెద్ద కూతరు బ్రహ్మిణి వివాహం 2007 లో అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఉగాది పర్వదినాన బ్రహ్మిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ రోజు నుంచి నారా వారి ఇంటా, నందమూరి వారి ఇంటా సందడి మొదలైంది. అంతే కాదండోయ్ చిన్నబాబుకు సెక్యూరిటీ కూడా ఓ రేంజ్ లో ఏర్పాటు చేశారు.


తన ముద్దుల బాబును చూసి మురిసిపోతున్న నారా లోకేష్ 


తాజాగా ఈ ముద్దుల చిన్నారికి  నారా దేవాన్ష్ అనే పేరు పెట్టారు. తాజాగా దేవాన్ష్ కు సంబంధించిన ఫోటోను విడుదల చేసారు. తల్లితండ్రులు బ్రహ్మణి-లోకేష్ లతో వున్న ఆ చిన్నారి దేవాన్ష్ ఫోటోను విడుదల చేసారు. ఈ ఫోటోను చూసిన నందమూరి అభిమానులు, టీడిపి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: