ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాంలోనూ, పవర్ లోనూ ఉన్న స్టార్  హీరో నందమూరి బాలక్రిష్ణ. నందమూరి బాలక్రిష్ణ అప్ మూవీలకి సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నందమూరి నటసింహం బాలకృష్ణ తన 99వ సినిమా కోసం సిద్ధమైన విషయం తెలిసిందే. బాలయ్య 99వ సినిమా కావడంతో మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. బాలీవుడ్‌లో పేరొందిన పెద్ద నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. 

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. మే 29న ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు జరగనున్నాయి.

జూన్ 12నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన,డైమండ్ రత్నంలు కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం విశేషంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా అంజలి నటించనుండగా, మరో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: