సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు వరుసగా వచ్చినంత మాత్రానా, ఆ హీరోయిన్ టాలెండెట్ హీరోయిన్ ఎంత మాత్రం కాదు. కొన్ని సందర్భాల్లో టాలెంట్ కలిసొస్తే, మరికొన్ని సందర్భాల్లో గ్లామర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఆ విధంగా తాప్సీకి మొదట వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో కేవలం తన గ్లామర్ కోసమే సినిమాల్లోకి హీరోయిన్ గా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

మొదటగా ఎక్కువ సినిమాలు చేసిన తాప్సీ, తరువాత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం తాప్సీ స్టోరి ఓరియంటెడ్ చిత్రాల్లోనే నటిస్తుంది. అలాగే తాజాగా ఓ కీ రోల్ ఉన్న సినిమాలో అవకాశాన్ని చేజిక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బేబీ, గంగ చిత్రాల్లో అద్వితీయ నటనతో విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది పంజాబీ సొగసరి తాప్సీ.

ఈ చిత్ర విజయాల్ని తనివితీరా ఆస్వాదిస్తున్న ఈ సొగసరి తాజాగా ఓ తమిళ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. వివరాల్లోకి వెళితే...శింబు, తాప్సీ నాయకానాయికలుగా కాన్ పేరుతో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో స్టెలిష్ పోలీస్ అధికారిగా చక్కటి అభినయానికి ఆస్కారమున్న ఓ విలక్షణ పాత్రలో తాప్సీ కనిపించనుంది. ఇందులో ఆమెపై భారీ పోరాట సన్నివేశాలున్నాయ చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న సమాచారం.

దీని గురించి తాప్సీ మాట్లాడుతూ నటిగా సవాళ్లను స్వీకరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఛాలెంజింగ్ పాత్రల ద్వారానే ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశముంటుంది. బేబీ తర్వాత మళ్లీ ఆ స్థాయి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో నాపై యాక్షన్ హీరోయిన్ అనే ముద్ర పడినా ఆశ్చర్యంలేదు అని చెప్పింది.   అంతే కాకుండా ఇది తన కెరీర్ కి మరో టర్నింగ్ పాయింట్ గా మారొచ్చని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: