నిన్న ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భం గా ఎన్టీఆర్ కు అంజలి ఘటించడానికి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన జూనియర్ కు మీడియా వర్గాల దగ్గర నుండి అనుకోని షాక్ ఎదురు అయ్యింది అని వార్తలు వస్తున్నాయి. ప్రతీ ఎన్టీఆర్ జయంతికి  క్రమం తప్పకుండా తన తాతగారి  ఘాట్ కు వచ్చే జూనియర్ ను చూడగానే గతంలో మీడియా వర్గాలు అతడి దగ్గరకు వెళ్ళి ఎన్టీఆర్ పైమాట్లాడమని అడగడమే కాకుండా మహానాడు కు వెళుతున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించేవారు. 

అయితే నిన్న ఉదయం మాత్రం మీడియా వారికి జూనియర్ ఎన్టీఆర్  ఘాట్ వద్ద కనిపించినా మీడియా వర్గాలు జూనియర్ ను పట్టించుకోకుండా  జూనియర్ తండ్రి హరి కృష్ణ కామెంట్స్ మాత్రమె రికార్డు చేసుకున్నారు . హరికృష్ణ  మీడియా వర్గాలతో  మాట్లాడటం అయిన తరువాత కొద్ది దూరంలో జూనియర్ నుంచి ని ఉన్నా  మీడియా కెమెరాలు  పట్టించు  కోకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.

అంతేకాదు తెలుగుదేశం మహానాడు  హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నా అక్కడ జూనియర్ కనిపించకపోయినా జూనియర్ మహానాడుకు ఎందుకురాలేదు అంటూ ఎటువంటి విశ్లేషణలు మీడియా లో కనిపించక పోవడంతో జూనియర్ ను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తిగా మీడియా కూడ లెక్కలోకి తీసుకోవడం లేదా? అనే కామెంట్స్ వినిపించాయి.

గత కొద్ది కాలంగా జూనియర్ కు తెలుగుదేశం పార్టీకి మధ్య పెరుగుతున్న దూరానికి సంకేతంగా మీడియా కూడ తెలుగుదేశం పార్టీ విషయాలకు సంబంధించి జూనియర్ ను పరిగణంలోకి తీసుకోకుండా కేవలం సినిమా హీరోగా మాత్రమే జూనియర్ ను మీడియా కూడ గుర్తిస్తోందా అనే కామెంట్స్ వినపడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: