దివంగత ఈవివి సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్, రవిబాబు దర్శకత్వలో ‘అల్లరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. యంగ్ హీరో అల్లరి నరేష్ బ్యాచిలర్ లైఫ్‌కు శుక్రవారంతో శుభం కార్డు పడనుంది. శుక్రవారం రాత్రి నరేష్ వివాహం చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విరూతో జరగనుంది. కృష్ణా జిల్లాకు చెందిన విరూప కుటుంబం చెన్నైలో స్థిరపడింది. నటులు రాజేంద్రప్రసాద్, నరేష్‌ల తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో కామెడీ చేస్తూ మరోవైపు గమ్యం, శంభో శివ శంభో లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన అల్లరి నరేష్.  


ఫిల్మ్ బై ఈవివి అంటూ పోస్ట్ చేస్తిన నరేష్ ఫ్రెండ్స్

Naresh ays good by to bachilor life

నరేష్ నివాసం పెళ్లిసందడితో కళకళలాడుతోంది. పలువురు చిత్ర, రాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. ఓ ఇంటి వాడు కాబోతున్న అల్లరి నరేష్‌కు తన ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చి...మరో వికెట్ డౌన్ అంటూ ఆటపట్టించారు. నరేష్ సన్నిహితులైన నాని, తరుణ్, నిఖిల్, ఖయ్యూం, శశాంక్ తదితరులు నరేష్‌ను టీజ్ చేస్తూ ఫొటో దిగి ట్వీట్ చేశారు.


వికెట్ డౌన్ అంటూ టీజ్ చేస్తున్న హీరోలు


మరింత సమాచారం తెలుసుకోండి: