సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ముందు అల్లుఅర్జున్ క్రేజ్ ఏ మాత్రం సరిపోదు. ప్రపంచ వ్యాప్తంగా రజినీకాంత్ కు అభిమానులు ఉండటమే కాకుండా అనేక దేశాల భాషలలో రజినీకాంత్ సినిమాలు డబ్ చేయబడ్డాయి. అటువంటి రజినీ క్రేజ్ తో పోటీ పడి అల్లుఅర్జున్ రజినీకాంత్ రికార్డుతో సమానంగా నిలబడిన విషయాన్ని కోలీవుడ్ మీడియా గుర్తించడమే కాకుండా బన్నీని పొగుడ్తూ వ్యాఖ్యలు రాస్తోంది. 

ఇక వివరాలలోకి వెళితే ఈ సంవత్సరం సమ్మర్ రేస్ ను ప్రారంభించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ పై వచ్చిన డివైడ్ టాక్ ను తట్టుకుని 51 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా బన్నీని మరోసారి 50 కోట్ల క్లబ్ లో సత్యమూర్తి చేర్చాడు. గత సంవత్సరం ‘రేసు గుర్రం’ తో 50 కోట్ల క్లబ్ లో స్థానం పొందిన బన్నీ తిరిగి అదే ఫీట్ ను రిపీట్ చేస్తూ వరసగా రెండవసారి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తో ఈ రికార్డును అందుకున్నాడు. 

అయితే టాలీవుడ్ లో అల్లుఅర్జున్ సినిమాలుకన్నా పవన్, రామ్ చరణ్, మహేష్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన రికార్డులు ఉన్నా వరసగా రెండు సార్లు 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించిన సినిమాలు వీరేవ్వరికీ వరసగా లేవు. అదేవిధంగా కోలీవుడ్ టాప్ హీరోలు విజయ్, విక్రమ్ సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో స్థానం పొందినా వీరికి కూడా వరసగా 50 కోట్ల మార్క్ ను అందుకున్న సినిమాలు లేవు. 

కానీ ఒక్క రజినీకాంత్ కు మాత్రం ఈ అరుదైన రికార్డు ఉంది. రజినీకాంత్ నటించిన ‘శివాజీ’ ‘రోబో’ సినిమాలు వరసగా 50 కోట్ల మైలురాయి దాటి 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి. అదేవిధంగా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న ‘లింగ’ కూడా రజినీకాంత్ ను 50 కోట్ల మైలురాయిని దాటించి 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. ఈ విధంగా ఎలా చూసుకున్నా ఒక్క రజినీకి మాత్రమే సొంతమైన వరస రికార్డులను టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ సమానం చేయడం చాల అరుదైన విషయం అని అంటూ కొలీవుడ్ మీడియా  వార్తలు వ్రాయడం బట్టి బన్నీకి కోలీవుడ్ లో కూడా క్రేజ్ పెరుగుతోంది అని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: