ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సినిమాల్లో స్టయిలిష్ గా కనిపించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. అయితే పవర్ స్టార్ ఇటీవల గడ్డంతో దర్శనమివ్వడం ప్రేక్షకుల్లో అమితాసక్తి కలిగిస్తోంది.

పవర్ స్టార్ ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా, గడ్డంతోనే వెళ్ళడంతో దీనికి సంబంధించిన న్యూస్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. కొందరు ఈ గడ్డానికి కారణం భీమవరానికి చెందిన ఓ స్వామిజీ సలహా అంటుంటే, ఏపీ రాజధాని కారణంగా భూములు కోల్పోయే రైతుల కోసం దీక్ష చేయడానికే పవన్ ఇలా గడ్డం పెంచుతున్నాడని మరికొందరు అంటున్నారు.

అయితే పవన్ న్యూ లుక్ కు కారణం గబ్బర్ సింగ్ 2 అని లేటెస్ట్ గా తేల్చేశారు. గబ్బర్ సింగ్ 2 సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందని, అందుకోసమే పవన్ గడ్డం పెంచాడని ఫిలింనగర్ సమాచారం. పూణెలో మొదలుకానున్న ఈ సినిమా షూటింగ్ లో మొదట ఫ్లాష్ బ్యాక్ సీన్లనే షూట్ చేస్తారట. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ని ఎవరు కలవటానికి వచ్చినా, ముందుగా గడ్డం కథ తెలుసుకోవటానికి ఆసక్తి చూపటంతో, పవన్ ఇక ఎంత మాత్రం ఆసలస్యం చేయకుండా గబ్బర్ సింగ్2 షూటింగ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా నిర్మాతలకి సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: