నిన్న తెలుగుదేశం మహానాడులో రాజకీయ వేత్తగా హడావిడి చేసిన బాలకృష్ణ ఒక్కరోజు గడవ కుండానే తన లుక్ ను పూర్తిగా మార్చుకుని టాప్ యంగ్ హీరోలకు షాక్ ఇచ్చే విధంగా ‘డిక్టేటర్’ గా మారి తన 99వ సినిమాను ఈరోజు ఉదయం లాంఛనంగా ప్రారంభించాడు. 

బాలకృష్ణకు వరస హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను క్లాప్ తో యంగ్ హీరోయిన్ అంజలిని పక్కన పెట్టుకుని కెమెరాలకు న్యూ లక్ తో పోజులు ఇచ్చాడు బాలకృష్ణ. ‘లౌక్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. 

అంజలి తో పాటు మరొక హీరోయిన్ ఈ సినిమాలో ఉంటుందని ఆమె వివరాలు తరువాత తెలియ చేస్తామని దర్శకుడు శ్రీవాస్ తెలియచేసాడు. బాలయ్య, అంజలిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేయగా బోయపాటి శ్రీను క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. 

ఈ సినిమాకు కోన వెంకట్ గోపీ మోహన్ లతో పాటు శ్రీధర్ సీపాన కూడ కలిసి స్క్రిప్ట్ రచనలలో పాల్గొనడమే కాకుండా మొట్టమొదటి సారిగా బాలకృష్ణ పై పంచ్ డైలాగ్స్ లేకుండా కేవలం వినోదాత్మకంగా బాలయ్యను చాల డిఫరెంట్ గా యంగ్ హీరోగా చూపెట్టబోతున్న ఈసినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి  రేసుకు రెడీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు బాలయ్య. అదే సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి 150వ సినిమా ఇంకా ప్రారంభం కాకపోయినా నందమూరి సింహం మాత్రం సంక్రాంతి రేస్ లో ముందున్నాడనే అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: