తెలుగు ఇండస్ట్రీలో ఆరు అడుగులు అందగాడు స్మయిలింగ్ ఫేస్ చూస్తే అమ్మాయిలు ఇట్టే ఆకర్శించే రూపం అదే నండి ప్రిన్స్ మహేష్ బాబు. మే 31. టాలీవుడ్ చరిత్రలో గుర్తుండిపోయే విధంగా రెండు అరుదైన ఘట్టాలకు తెర లేప బోతున్నారు. నిజమే సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ చిత్రాల ఫస్ట్ లుక్  ఆరోజే రిలీజ్ కాబోతున్నాయి ఎందుకంటే మహేష్ బాబుకి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టి రోజు ఏ సినిమా అయిన రిలీజ్ అయినా లేదా ఆడియో ఫంక్షన్ లాంటివి చేసి తండ్రికి గిఫ్ట్ గా ఇవ్వడం ఆనవాయితీ.

శ్రీమంతుడు ఫ్యాన్స్ మేడ్ పోస్టర్


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు (టైటిల్ కన్ఫర్మ్ కాలేదు) ఫస్ట్ లుక్ ఈనెల 31 న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు సంబంధిచిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాల్ ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది, ప్రిన్స్ మహేష్ బాబు ఈ పోస్టర్ లో సైకిల్ పై కూర్చొని కూల్ గా చాలా స్టయిలిష్ గా కనబడుతున్నాడు. మరి టైటిల్ ఖరారు కాలేదు కాని అఫిషియల్ గా పోస్టర్ లో ఆ పేరుతో ఎందుకు విడుదల చేశారో చిత్ర యూనిట్ కే తెలియాలి బహుషా అదే టైటిల్ ఖరారు కావచ్చ కాబోలు.


మరింత సమాచారం తెలుసుకోండి: