‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయిన ఒక్కరోజు గ్యాప్ లో హడావిడిగా అనుకున్న తేదీకన్నా ముందుగానే నిన్న మధ్యాహ్నం విడుదలైన ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ చూసి కొద్దిసేపు మహేష్ అభిమానులే ఖంగారు పడ్డారు. దీనికి కారణం 31వ తారీఖు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు విడుదల అవుతుంది అనుకున్న ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ రెండు రోజులు ముందుగానే విడుదల కావడంతో ఇది ఎవరో క్రియేట్ చేసిన డమ్మీ ఫస్ట్ లుక్ అయి ఉంటుంది అంటూ మహేష్ అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేసారు.

అయితే కొద్ది సేపటికి మహేష్ బాబు ఇది ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ అంటూ ట్విట్ చేసేసరికి మహేష్ అభిమానులు తెరిపిన పడ్డారు. అయితే 31వ తారీఖున జరగబోయే కృష్ణ పుట్టినరోజును రెండు రోజులు ముందుగానే తన అభిమానులు తన తండ్రి పుట్టినరోజు వేడుకలను జరుపుకునేలా ముందుగానే కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇంత హడావిడిగా ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ విడుదల కావడానికి ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ వాయిదా పడటం కారణం అని అంటున్నారు. 

దీనితో కొంతమంది విమర్శకులు ‘బాహుబలి’ ఆడియో పోస్ట్ పోన్ కావడంతో మహేష్ కృష్ణ పుట్టినరోజును మే 31న కాకుండా రెండు రోజులు ముందుకు మే 29 నుంచే జరుపుకుంటున్నాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ‘శ్రీమంతుడు’ టీజర్ కృష్ణ పుట్టినరోజు అయిన రేపు ఉదయం 7 గంటలకు విడుదల చేస్తామని అధికారి కంగా ప్రకటించారు.  

ఇది ఇలా ఉండగా దర్శకుడు కొరటాల శివ ‘‘అభిమానుల నుంచి వచ్చిన ఈ అద్భుతమైన స్పందనకు కృతజ్ఞతలు. సూపర్ ఫాన్స్ ప్రేమతో కదిలిపోయాను’’ మహేష్ ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ కు వచ్చిన విశేష స్పందన పై స్పందిస్తూ మే 31న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియచేస్తాను అంటూ ట్విట్ చేయడం బట్టి రేపు ఇంకా ఏమైనా ‘శ్రీమంతుడు’ గురించి అనుకోని సంచలనాలు ఉంటాయా అని మహేష్ అభిమానులు ఆ శక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘శ్రీమంతుడు’ ఎట్టి పరిస్తుతులలోను జూలై 17న విడుదల అవుతుంది అని వస్తున్న వార్తలు బట్టి ‘బాహుబలి’ ఆడియో వాయిదాతో రాజమౌళి  సినిమా విడుదల కూడ వాయిదా పడవచ్చు అని వస్తున్న వార్తలను మహేష్ గట్టిగానే నమ్ముతున్నట్లు కనిపిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: