తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయిన పవన్ కళ్యాన్ మొదట్లో కాస్త ప్లాప్ లు, హిట్లు లాంటివి చూసినా తన క్రేజ్ మాత్రం తగ్గించుకోలేదు చిరంజీవి తమ్ముడిలా కాకుండా తనకంటూ ఓ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్య వచ్చిన పనవ్ కళ్యాన్ సినిమాలు సెన్సేషనల్ హిట్లు సాధించాయి ఇక మనోడి రేంజ్ మామూలుగా పెరగలేదు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించి రాజకీయంగా కూడా తన సత్తా చాటాడు.  చాలా రోజుల తర్వాత పవన్ మళ్లీ షూటింగ్ బాట పట్డాడు.. మరి ఖాళీగా ఉన్న సమయంలో ముఖానికి మేకప్ లేకుండా చాలా సాదాసీదాగా గడ్డం పెంచుకొని సాధువులా కనపడ్డాడు.


మంచు మనోజ్ వివాహానికి వచ్చిన పవన్ కళ్యాన్ 


అంతేందుకు మొన్నామధ్య జరిగిన మంచు మనోజ్ వివాహానికి కూడా గడ్డం తోనే వచ్చాడు. ఇక పవన్ కళ్యాన్ గడ్డం పెంచడం పై రక రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. పవర్ సినిమా తో తన సత్తా చాటుకున్న దర్శకుడు బాబీ  దర్శకత్వంలో గబ్బర్ సింగ్2 సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాన నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆ షూటింగ్ నిన్న పూనేలో స్టార్ట్ అయ్యింది. ఈ రకంగానైనా పవన్ కళ్యాన్ కి మళ్లీ పాత కళ వస్తుందా అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు, సినిమా స్టార్ట్ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: