ఛార్మీ ఎన్నో ఆశలు పెట్టుక్కున ‘జ్యోతిలక్ష్మి’  ఆడియో వేడుక జూన్ 4న  హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించడానికి ఈ సినిమా నిర్మాత సి. కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తున్న నేపధ్యంలో ఈ ఆడియో వేడుకలో ఛార్మీ ఒక సంచలనం చేయడానికి నిశ్చయించుకుని అప్పుడే ఆ విషయమై ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది అన్న వార్తలు వస్తున్నాయి. 

బాలీవుడ్ ఫంక్షన్స్ లో జరిగే విధంగా ఆ కల్చర్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ ఛార్మీ ఈ ఆడియో ఫంక్షన్ లో పది  నిముషాల సేపు లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. చార్మీ నటించిన సినిమాల లోని కొన్ని హిట్ సాంగ్స్  ను ఎంపిక చేసి వాటికి అనుగుణంగా అదర గొట్టే విధంగా 10 నిమిషాల లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ కు ‘జ్యోతిలక్ష్మి’ ఆడియో ఫంక్షన్ వేదిక కాబోతోంది అని టాక్. 

ఈ లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ ద్వారా ఛార్మీ తనలోని డాన్సింగ్ స్కిల్స్ ఏమాత్రం తగ్గలేదు అని సంకేతాలు ఇస్తూ తాను  ఏవిధంగాను టాప్ హీరోయిన్స్ రేస్ లో వెనకపడి లేను అని టాలీవుడ్ దర్శక నిర్మాతలకు సంకేతాలు ఇచ్చే విధంగా ఛార్మీ చాలా పట్టుదలగా ఈ లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ చేయబోతోంది అని టాక్. ప్రస్తుతం ఛార్మీ కెరియర్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఈ సినిమా కోసం ఛార్మీ తన బరువును బాగా తగ్గించుకుని యూత్ ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. 

సెక్స్ వర్కర్ గా ఈ సినిమాలో ఛార్మీ నటిస్తున్న పాత్ర చాల సంచలనంగా ఉండటమే కాకుండా రివెంజ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో ఈ కథ నడుస్తుంది అని టాక్. అయితే గతంలో ఛార్మీ సెక్స్ వర్కర్ గా నటించిన ‘ప్రేమ ఒక మైకం’ సినిమా ఘోర పరాజయం చెందడంతో ఇటువంటి కథలను ప్రస్తుత తరం ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నది ప్రశ్న.  అయితే ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో హీరోయిన్ ఓరియంటెడ్ చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్న నేపధ్యంలో అదే చరిత్ర ఛార్మీ ఇక్కడ కూడా రిపీట్ చేస్తుందా అనే అంచనాలు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: