రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉన్నవాళ్లు ఏం చేసినా వెరైటే కదా..!! ప్రిన్స్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ పోస్టర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే.. అయితే ఇప్పటికే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది, విపరీతమైన లైకులు వస్తున్నాయి. అంతే కాదు మహేష్ బాబు శ్రీమంతుడు ఫస్ట్ లుక్ ని టైటిల్ లోగో ని రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి మహేష్ బాబు బ్యానర్ అలా కనబడబోతుంది. మరి మహేష్ బాబు సైకిల్ పై వస్తూ అంతి సింపుల్ గా ఫస్ట్ లుక్ విడుదల చేశారేంటబ్బా అని అందరికీ అనుమానం రావు కానీ దాని వెనుక పెద్ద ట్విస్ట్ ఉందండి బాబు..!


మహేష్ బాబు శ్రీమంతుడు ఫ్యాన్స్ మేడ్ పోస్టర్


మహేష్ వాడింది మామూలు సైకిల్ కాదు ఇక ఆ సైకిల్ విలువ ఎంతో తెలుసా ...? అక్షరాల మూడున్నర  లక్షలు.. వామ్మో అని గుండెలు బాధుకుంటున్నారా.. మీరు వింటున్నది కరెక్టే ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా దాని విలువు అంతే..అసలు నిజం ఏంటంటే అచ్చం సైకిల్ ని పోలినట్లు ఉండే బైక్ అన్నమాట . అందుకే ఇంత భారీ మొత్తం . మొత్తానికి శ్రీమంతుడు లుక్ మహేష్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: