మెగా హీరోలతో, అల్లువారి హీరోలతో సినిమాలు తీసే దర్శకులు పడేపాట్లు పై గతంలోనే ఎన్నోసార్లు గాసిప్పులు వచ్చాయి. ఇప్పుడు దర్శకుడు బోయపాటి కూడ అటువంటి వార్తలలో చిక్కుకున్నాడు. ‘లెజెండ్’ సక్సస్ తరువాత టాప్ హీరోల ఇళ్ళ చుట్టూ తిరిగి ఏదోవిధంగా తన మాటల మాయతో బన్నీని బోయపాటి పడేసినా అల్లుఅర్జున్ ఇస్తున్న ఝలక్ లతో బోయపాటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని టాక్.

బోయపాటి అల్లుఅర్జున్ కాంబినేషన్ లో మొదలు కాబోతున్న సినిమాకు షూటింగ్ ప్రారంభం కాకుండానే రకరకాల సమస్యలు ఆ సినిమాను వెంటాడుతున్నాయని టాక్. ఈ చిత్రకథ అనుకున్న విధంగా తీద్దామని బోయపాటి భావిస్తున్నా అల్లు అరవింద్ మాత్రం అడ్డు చెప్పి మళ్లీ కథ రాసుకొని రమ్మన్నాడట. 

దానితో ఏమి చేసిది లేక మళ్లీ కథలో మార్పులు చేసి బన్నీకి వినిపిస్తే అల్లుఅర్జున్ మరికొన్ని మార్పులు సూచించడంతో బోయపాటి కథ మళ్ళీ ముందుకు వచ్చింది అని అంటున్నారు. ఈ చిత్రంలో హాన్సికను హీరోయిన్ గా ఎంపిక చేయడం బోయపాటికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా అల్లుఅరవింద్ బలవంతం పై బోయపాటి ఒప్పుకున్నాడు అనే వార్తలు కూడ వస్తున్నాయి. 

ఈ సినిమాప్రారంభం కాకుండానే పరిస్థితి ఇలా ఉంటే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యాక ఇంకా ఎన్ని అనుకోని ట్విస్టులు అల్లువారి కాంపౌండ్ నుంచి వస్తాయో అని బోయపాటి భయపడుతున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు ఈపరిస్థుతులు ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో మెగా హీరోలతో అల్లువారి హీరోలతో సినిమాలు తీయడానికి దర్శకులు భయపడిపోతారు అంటూ ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: