ఇప్పుడు రాజమౌళి అంటే... లోకల్ కాదు, జాతీయ స్థాయి వ్యక్తి. ఆయన సినిమాలే ఆయనకు ఆ హోదానిచ్చాయి. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఈగ... ఈ సినిమాలు రాజమౌళిని యావద్భారత దేశానికి పరిచయమయ్యేలా చేశాయి. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన సన్ ఆఫ్ సర్దార్... మర్యాద రామన్నకు రీమేక్. అందులో అజయ్ దేవ్ గణ్ నటించాడు. అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించాడు. ధీర్ ఈ సినిమాను తీసిన తరవాత... రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తాడు. రాజమౌళి మర్యాద రామన్నను అద్భుతంగా తీశాడనీ... అందుకే, దాన్ని హిందీలో తీయాలనుకున్నామనీ చెప్పాడు. అయితే, మర్యాద రామన్నకూ సన్ ఆఫ్ సర్దార్ కూ చాలా తేడా ఉంది. ఇందులోని మూల కథను తీసుకుని చాలా మార్పులు చేశాడు ధీర్. అందుకే, రాజమౌళి తన సినిమాను తప్పకుండా చూడాలని అడుగుతున్నాడు. తాను చాలా మార్పులు చేశాననీ అవన్నీ రాజమౌళికి నచ్చాయో లేదో తనకు చెప్పాలని కోరుతున్నాడు. తెలుగులో కంటే... హిందీలో అజయ్ నటన ఇంకా నవ్విస్తుందని భరోసా కూడా ఇస్తున్నాడు. మరి, రాజమౌళి ఏమంటాడో? 

మరింత సమాచారం తెలుసుకోండి: