తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న హీరో శింబు. శింబు నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా కూడా విజయవంతం అయ్యాయి. కాగా, శింబు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళంలో శింబు నటించిన ఓస్తీ సినిమాను తెలుగులో పోలీస్ టైగర్ పేరుతో విడుదల చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే హిందీలో సూపర్ హిట్టయిన దబాంగ్ ఆధారంగా ఈ ఓస్తీ సినిమాను నిర్మించారు. అదే సినిమా ఆధారంగా తెలుగులో గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే కథాంశంతో శింబు సినిమా ఇక్కడ విడుదల అవుతుంది. తెలుగులో తమిళ సినిమా అభిమానులతో పాటు, తెలుగు శాటిలైట్ టీవీ రైట్స్ కూడా బాగానే డబ్బులు తీసుకుని వస్తాయని శింబు భావిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: