పవన్ కళ్యాణ్ తన లుక్ ను మార్చుకోవడం కోసం బెంగుళూరులోని ఒక జిమ్ లో ప్రత్యేకమైన ట్రైనర్స్ మధ్య గంటల కొద్దీ కష్టపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ జిమ్ బెంగుళూరు సిటీలోని కోరమంగళ ప్రాంతంలో ఉండటంతో అక్కడ పవన్ ను చూసేందుకు ప్రతిరోజు వస్తున్న వేలాది మంది జనంతో అక్కడి ప్రాంతం వారికి అనుకోని సమస్యలు ఏర్పడటమే కాకుండా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రాంత సమీపంలో అనేక విధ్యా సంస్థలు ఉండటంతో ఈ జనం మధ్య స్కూల్ బస్సులను నడపటానికి కూడ చాలా విధ్యా సంస్థలు ఇబ్బంది పడుతున్నట్లు టాక్. దీనితో ప్రతిరోజు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ జిమ్ చుట్టుపక్కల నుంచుని ఉన్న అనేక మందిని బయటకు పంపించి వేయడం ఒక కష్టతరమైన పనిగా మారిందని వార్తలు వస్తున్నాయి. 

2014 ఎన్నికలలో కూడ పవన్ కు కన్నడ ప్రజలలో ముఖ్యంగా అక్కడి తెలుగు వారిలో ఉన్న క్రేజ్ ను పసికట్టి భారతీయ జనతాపార్టీ తన ఎన్నికల ప్రచారానికి పవన్ ను అక్కడ కూడ బ్రహ్మాస్త్రంగా వాడుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ ను చూడటానికి ఈ స్థాయిలో ఇలా భారీగా జనం రావడం ఇదే మొదటిసారి.

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ఎంతో కష్టపడి జిమ్ లో వ్యాయామం చేస్తున్న పవన్ శరీరపు బరువు ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో మరికొన్ని రోజులు కష్టపడాలని పవన్ కు ట్రైనర్స్ సలహా ఇచ్చినట్లు టాక్. దీనివల్ల జూలై మొదటి వారంలో ప్రారంభం అవుతున్న ‘గబ్బర్ సింగ్ 2’ షెడ్యూల్ షూటింగ్ ఈ సారి కూడ కొద్ది రోజులు పవన్ లేకుండానే సినిమాలోని మిగతా పాత్రల సన్నివేశాలు చిత్రీకరిస్తారు అని తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: