అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నా వీరి వెనుక ఒక ప్రముఖ వ్యక్తి సహాయ సహకారాలు ‘బాహుబలి’ నిర్మాణ విషయంలో ఉన్నాయి ఆంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి జరుగుతోంది. 

ప్రముఖ పత్రికా అధిపతి మీడియా కింగ్ రామోజీరావు సహాయ సహకారాలు లేకపోతే ‘బాహుబలి’ ఇంత ప్లాన్డ్ గా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయి ఉండేవి కావని కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కామెంట్ చేస్తున్నట్లు టాక్. ‘బాహుబలి’ సినిమాకు అయిన ప్రధాన బడ్జెట్ లో గ్రాఫిక్స్ మీద పెట్టిన ఖర్చు తరువాత అత్యధిక భాగం ఆ సినిమా సెట్స్ నిర్మాణం పై ఖర్చు పెట్టారు.

అయితే ‘బాహుబలి’ సినిమా షూటింగ్ అంతా రామోజీ ఫిలిం సిటీలోనే జరగడంతో పాటు ఆ సినిమా సెట్స్ కోసం ఖర్చు పెట్టిన భారీ మొత్తాలను  రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం భరించిందని టాక్. ఈ విషయమై రాజమౌళి స్పష్టంగా బయటకు చెప్పకపోయినా రామోజీరావు సహాయ సహకారాలు లేకుంటే ‘బాహుబలి’ ని తాను ఈ విధంగా తీయలేక పోయేవాడినని రాజమౌళి చేసిన కామెంట్స్ ఈ రూమర్స్ కు బలం చేకూరుస్తున్నాయి అనే టాక్ కూడా ఉంది. 

బిజినెస్ షేరింగ్ సిస్టమ్ లో రామోజీ ఫిలిం సిటీ కూడ ‘బాహుబలి’ లో భాగస్వామి అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరొక ఆ శక్తికర కామెంట్స్ కూడ వినపడుతున్నాయి. ఈ మధ్య లండన్ నుంచి ప్రచురితమయ్యే ‘గార్డియన్’ మ్యాగజైన్ ‘బాహుబలి’ విశేషాలతో పాటు రామోజీ ఫిలిం సిటి విశేషాలను హాలీవుడ్ నిర్మాతలకు పరిచయం చేస్తూ ప్రచురింపబడ్డ వ్యాసాలను బట్టి ‘బాహుబలి’ రామోజీ ఫిలిం సిటీల వ్యూహాత్మక భాగస్వామ్యం బతపడుతోంది అని ఫిలింనగర్ గాసిప్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: